మాల్స్, ఈవెంట్లలో కోవిడ్-19 పరిమితుల సడలింపు
- October 29, 2022
యూఏఈ: కోవిడ్-19 ముందుజాగ్రత్త చర్యలను అబుధాబి సడలించింది. వాణిజ్య, పర్యాటక సంస్థలు, ఈవెంట్లలో ఈడీఈ(EDE), థర్మల్ స్కానర్ల వినియోగాన్ని నిలిపివేసింది. అయితే, యూఏఈ రాజధానిలోని షాపింగ్ మాల్స్‌తో సహా చాలా బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి అల్‌హోస్న్(AlHosn) యాప్‌లో గ్రీన్ పాస్ తప్పనిసరి. అబుదాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ సూచనల ప్రకారం తాజా నిర్ణయం తీసుకున్నట్ల అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సంస్థలకు జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. కాగా.. అబుధాబిలో కొత్త కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో గ్రీన్ పాస్ నిబంధనను కూడా త్వరలోనే సడలించే అవకాశం ఉందని మాల్స్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో స్థానిక అధికారులు కోవిడ్-19 ప్రోటోకాల్‌లను సడలించారు.గ్రీన్ పాస్ చెల్లుబాటును 30 రోజులకు పెంచారు. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించడాన్ని ఐచ్ఛికం చేశారు. ఐసోలేషన్ వ్యవధిని ఐదు రోజులకు తగ్గించారు. అబుధాబిలోకి ప్రవేశించే ప్రయాణీకులు, క్రూయిజ్ షిప్‌ల సిబ్బంది పర్యాటక ఆకర్షణలు, సంస్థలను సందర్శించడానికి గ్రీన్ పాస్ నుండి మినహాయించారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









