నవంబర్ 11-12 తేదీల్లో బీఐసీలో ‘డబ్ల్యూఈసీ సీజన్ 2022’
- October 29, 2022
బహ్రెయిన్: నవంబర్ 11-12 తేదీల్లో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC)లో FIA WEC సీజన్ 2022 ఫైనల్స్ జరుగనున్నాయి. ఇందులో మొత్తం 10 టైటిళ్ల కోసం 2022 సీజన్ ఫైనల్ లో పోటీదారులు పాల్గొంటున్నారు. ఎండ్యూరెన్స్ రేసింగ్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ ఫైనల్స్ కి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సిరీస్ ఫైనల్ లో పోటీపడుతున్న ఛాంపియన్లందరూ "ది హోమ్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్ ఇన్ ది మిడిల్ ఈస్ట్"లో తమ అధృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హైపర్‌కార్, లే మాన్స్ గ్రాండ్ టూరింగ్ ఎండ్యూరెన్స్ (LMGTE) ప్రో, LMGTE ఆమ్ కేటగిరీలలో రెండు ఛాంపియన్షిప్ లు జరుగనున్నాయి. వీటితోపాటు నాలుగు లీ మాన్స్ ప్రోటోటైప్ 2 (LMP2) ఛాంపియన్ షిప్స్ కూడా సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. టిక్కెట్లు BIC వద్ద అందుబాటులో ఉన్నాయని, రెండు రోజుల వారాంతపు ప్రోగ్రామ్ కోసం పెద్దలకు కేవలం BD5, పిల్లలకు BD2.5 టిక్కెట్ల ధరను నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









