ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమానికి చంద్రబాబునాయుడు ..

- April 21, 2016 , by Maagulf
ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమానికి చంద్రబాబునాయుడు ..

అనంతపురం జిల్లా రామగిరి మండలం తిరుమల దేవర ఆలయంలో మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య 250 జంటలు ఒక్కటయ్యాయి. వివాహాల అనంతరం నూతన దంపతులను చంద్రబాబు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నేతలు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com