మలయాళ నటుడు సురేష్ గోపికి కేంద్రమంత్రి పదవి
- April 21, 2016
ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపికి కేంద్రమంత్రి పదవి వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు కమలనాథులు. సురేష్ గోపిని కేరళ నుంచి రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ అగ్రనేతలు నిర్ణయించినట్లు సమాచారం. గత ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సురేష్ గోపి న్యూఢిల్లీలో సమావేశమై... ఈ అంశంపై చర్చించారని తెలిసింది.కాగా సురేష్ గోపిని నేషనల్ ఫిల్మ్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో నియమించాలని కమలం పార్టీ అగ్రనేతలు ఇప్పటి వరకు భావించారు. కానీ అమిత్ షాతో సురేష్ గోపి భేటీ అనంతరం తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసి మోదీ మంత్రివర్గంలో చోటు కల్పించాలని సదరు నాయకుల మధ్య ప్రచారం సాగుతోంది. ఎందుకంటే నరేంద్రమోదీ కేబినెట్ లో కేరళ రాష్ట్రం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ అవకాశం సురేష్ గోపికి ఇవ్వాలని వారు నిర్ణయించారు.అయితే కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 16 తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన్ని ఎన్నికల బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయాన్ని సురేష్ గోపి సున్నితంగా తిరస్కరించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నాయి. అందులోభాగంగా ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఆయనతోపాటు సురేష్ గోపి కూడా ఈ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిసింది. ఇప్పటికే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన మరోవైపు బీజేపీకి ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







