ఉగ్రవాదుల కిరాతకం పరాకాష్ఠకు చేరింది

- April 21, 2016 , by Maagulf
ఉగ్రవాదుల కిరాతకం పరాకాష్ఠకు చేరింది

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల కిరాతకం పరాకాష్ఠకు చేరింది. ఇతర మతాలకు చెందిన పదేండ్ల లోపు బాలికలను చెరపట్టి లైంగిక బానిసలుగా అమ్మి సొమ్ము చేసుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు సొంత సహచరులనే పొట్టన పెట్టుకుంటున్నారు. తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్న ఐఎస్ ఉగ్రవాదులు తమ తోటివారిని చంపి, వారి అవయవాలను బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. పోరాటంలో గాయపడిన ఉగ్రవాదులను హతమార్చి, వారి అవయవాలను తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. గాయపడిన ఉగ్రవాది అవయవాలను తీయాలని ఉగ్రవాదులు డాక్టర్లను బెదిరిస్తున్నారని అరబిక్ దినపత్రిక అల్ సబా తెలిపింది. మొసుల్ నగరంలోని దక్షిణ భాగాన్ని కోల్పోయిన అనంతరం ఐఎస్ ఉగ్రవాదులు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నారని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ తెలిపింది.దక్షిణ మొసుల్‌లో జరిగిన పోరాటంలో ఓటమిచెంది గాయపడి వెనక్కి వచ్చిన ఉగ్రవాదులను చంపి, వారి గుండె, కిడ్నీలను బ్లాక్‌మర్కెట్‌లో అమ్ముతున్నారని స్పెయిన్ దినపత్రిక ఎల్‌మోండో తెలిపింది. అంతేకాకుండా ఐఎస్ ఉగ్రవాదులు తాము బందీలుగా పట్టుకొచ్చిన వారి అవయవాలను కూడా తొలగించి అమ్ముకుంటున్నారని ఆరోపించింది. మొసుల్ జైళ్లలో మరణశిక్షకు గురైన ఖైదీలను రక్తదానం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, అందుకోసం వారికి శిక్ష అమలుచేయకండా వాయిదా వేస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. అవయవాలు తొలగించిన 183 మృతదేహాలను మొసుల్‌లోని ఒక దవాఖానలో చూశామని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com