వ్యక్తి చేతిలో గాయపడ్డ మహిళకు Dh20,000 పరిహారం

- October 31, 2022 , by Maagulf
వ్యక్తి చేతిలో గాయపడ్డ మహిళకు Dh20,000 పరిహారం

అబుధాబి: ఒక మహిళపై దాడి చేసి మానసికంగా హింసించిన వ్యక్తికి కోర్టులో చుక్కెదురైంది. మానసికంగా క్షోభను అనుభవించిన మహిళకు పరిహారంగా 20,000 దిర్హామ్‌లు చెల్లించాలని కోర్టు సదరు వ్యక్తిని ఆదేశించింది. అంతకుముందు ఆ మహిళ ఆ వ్యక్తిపై అల్ ఐన్ సివిల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో దావా వేసింది.తాను అనుభవించిన భౌతిక, నైతిక నష్టాలకు పరిహారంగా తనకు Dh100,000 చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. నిందితుడు తనను తీవ్రంగా కొట్టాడని, దాని వల్ల తన నుదిటి, ఎడమ చేయి, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయని తన వ్యాజ్యంలో పేర్కొంది. ఈ ఘటన తర్వాత తాను 20 రోజులకు పైగా పని చేయకుండా ఉండిపోయినట్లు వివరించింది. అంతకుముందు అతడిని ఇదే కేసులో క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించి 3,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది. అన్ని పక్షాల నుండి విన్న తర్వాత, సివిల్ కోర్టు న్యాయమూర్తి బాధితురాలికి 20,000 దిర్హామ్‌లు చెల్లించాలని ప్రతివాదిని ఆదేశిస్తూ తీర్పును జారీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com