అబుధాబి BAPS హిందూ మందిర్ లో ఘనంగా దీపావళి వేడుకలు
- October 31, 2022
            అబుధాబి: BAPS హిందూ మందిర్లో వరుసగా మూడవ సంవత్సరం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 10,000 మంది సందర్శకులు హాజరయ్యారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన వేడుకలు రోజంతా ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగాయి. యూఏఈ టోలరెన్స్, కోఎగ్జిటెన్స్ మినిస్టర్ షేక్ నహ్యాన్ మబారక్ అల్ నహ్యాన్ సహా వందలాది మంది ప్రముఖులు ఈ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళిని జరుపుకుంటారని ఈ సందర్భంగా BAPS మిడిల్ ఈస్ట్ అధిపతి పూజ్య బ్రహ్మవిహారి స్వామి వివరించారు. ఈ కార్యక్రమానికి యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, యూఏఈలోని రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే రాయబారి జోస్ అగ్యురో అవిలా తదితరలు హాజరయ్యారు.



తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 - బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
 - పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
 - రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
 - వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
 - ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
 - కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
 







