2,000 నకిలీ వేలిముద్రలతో దోపిడీ.. ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్
- October 31, 2022 
            రియాద్: 2,000 మంది వ్యక్తుల వేలిముద్రలను అక్రమ మార్గాల్లో సేకరించి.. వాటితో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఒక సౌదీ పౌరుడు, ఆరుగురు ఆసియా జాతీయులతో సహా ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ ముఠా వ్యక్తుల వేలిముద్రలను పొందడంతోపాటు వారికి తెలియకుండానే వారి పేర్లపై సిమ్‌కార్డులను తీసుకుంటుందన్నారు. అనంతరం ఆయా వ్యక్తులను సంప్రదించి, ఆర్థిక సంస్థల ప్రతినిధులమని నమ్మించేవారు. బాధితుల వేలిముద్రలను దుర్వినియోగం చేయడం ద్వారా వారి ఫోన్ నంబర్లకు వచ్చిన OTP లను ముఠా సభ్యులు తెలుసుకుంటున్నారు. తద్వారా వారి రహస్య డేటాను యాక్సెస్ చేసి వారి ఖాతాల నుండి డబ్బును ముఠా దొంగిలించేది. బాధితుల ఫిర్యాదుతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలోని ఆర్థిక నేరాల విభాగం ముఠా మోసపూరిత పద్ధతులపై దృష్టి సారించింది. మోసాలకు పాల్పడేందుకు వీలుగా ముఠాలోని సౌదీ పౌరుడు టెలికమ్యూనికేషన్స్ రంగంలో వాణిజ్యపరమైన రిజిస్ట్రేషన్‌ను పొందినట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దీనికి సంబంధించి అటార్నీ జనరల్ జారీ చేసిన ఆదేశాల మేరకు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







