గుజరాత్లో కేబుల్ వంతెన దుర్ఘటన: భారత్కు ఒమన్ సంతాపం
- October 31, 2022 
            మస్కట్: మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ వంతెన కూలిన ఘటనపై ఒమన్ సుల్తానేట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఇండియాలోని గుజరాత్లో ఆదివారం సాయంత్రం కేబుల్ వంతెన కూలిపోయిన ఘటనలో 140 మంది మరణించగా.. వందలాది మంది మచ్చు నదిలో పడి గాయపడ్డారు. వంతెన కూలిన సమయంలో దానిపై దాదాపు 350 మంది వరకు పర్యాటకులు ఉన్నారని, మృతుల్లో పెద్ద సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారని అధికారులు తెలిపారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు మచ్చు నదిపై 230 మీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు. 8 నెలలపాటు వంతెనకు పునరుద్ధరణ పనులు జరిపి అక్టోబర్ 26న కేబుల్ వంతెనను పర్యాటకుల కోసం తెరిచారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్లో బ్యాంకులకు సెలవులే సెలవులు







