‘హరోం హర’ అంటోన్న సుధీర్ బాబు.! ‘కార్తికేయ’ను కాపీ కొట్టేస్తాడా.?

- October 31, 2022 , by Maagulf
‘హరోం హర’ అంటోన్న సుధీర్ బాబు.! ‘కార్తికేయ’ను కాపీ కొట్టేస్తాడా.?

సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా, సినిమాలు చేసుకుంటూ పోయే హీరో సుధీర్ బాబు. కంటెంట్ వున్న కథలనే సుధీర్ బాబు ఎంచుకుంటూ వుంటాడన్న ఒకింత నమ్మకం వుంది సుధీర్ బాబుపై ఆడియన్స్‌కి.
అప్పుడప్పుడూ కాస్త తప్పటడుగులు వేసినా, దాదాపు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే వుంటాడు సుధీర్ బాబు. మొన్నీమధ్యనే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అన్నాడు. 
ఆ తర్వాత ‘హంట్’ అనే కొత్త సినిమాని లైన్‌లో పెట్టాడు. రేపో మాపో ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోపే మరో కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసేశాడు సుధీర్ బాబు. 
ఆ ప్రాజెక్ట్‌కి సంబందించి రీసెంట్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫస్ట్ లుక్‌కి సంబంధించి, తాజాగా టైటిల్ అనౌన్స్‌మెంట్ జరిగింది. సుధీర్ బాబు కొత్త సినిమాకి ‘హరోం హర’ అనే టైటిల్‌ని కన్‌ఫామ్ చేస్తూ మరో పోస్టర్ రిలీజ్ చేశారు.
ఓ చేతిలో గన్, మరో చేతిలో సుబ్రహ్మణ్య స్వామి ఆయుధాన్ని పట్టుకుని వెనక్కి నిలబడి కనిపిస్తున్నడీ పోస్టర్‌లో హీరో. దూరంగా గుడి గోపురం కనిపిస్తోంది. పక్కనే ఓ జీపు.. మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్‌‌లుక్‌కి ఈ పోస్టర్ కొనసాగింపుగా వుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘కార్తికేయ 2’ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ తరహా ఫార్ములానే ఈ సినిమాలో యూజ్ చేయబోతున్నారా.? అనే డౌటానుమానం కొడుతోంది ఆడియన్స్‌కి తాజా పోస్టర్ చూస్తుంటే. చూడాలి మరి, సుధీర్ బాబు ‘హరోం హర’ అంటూ ఏం చేయబోతున్నాడో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com