‘కాంతారా’ మేనియా తగ్గేదే లే.! ఆలోచనలు మారిపోతున్నాయ్ బాస్.!

- October 31, 2022 , by Maagulf
‘కాంతారా’ మేనియా తగ్గేదే లే.! ఆలోచనలు మారిపోతున్నాయ్ బాస్.!

కన్నడ సినిమా ‘కాంతారా’ గురించి ఏదో ఒక న్యూస్ ప్రతీ రోజూ హాట్ అప్‌డేట్‌గా మారింది మీడియాలో. ఈ సినిమా రిలీజై కొన్ని వారాలు గడుస్తోంది. కానీ, ఈ సినిమా వసూళ్లు నిలకడగా నడుస్తున్నాయ్. 
కన్నడ సాంప్రదాయాన్ని అనుసరించి తెరకెక్కిన ఈ సినిమాని యూనిక్‌గా అన్ని భాషల వారూ, అన్ని ప్రాంతాల వారూ ఓన్ చేసుకున్నారు. దాంతో, ‘కాంతారా’ వంటి సినిమాలు చేయాలంటూ మేకర్లు తమ అభిప్రాయాలు మార్చేసుకుంటున్నారట.
కథలు కూడా ఆ ఫార్ములాలోనే రూపొందాలన్న ఒత్తిడి రచయితలపై పెరుగుతోందట. మరోవైపు, ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక నెగిటివిటీ కూడా వినిపిస్తూనే వుంది. రీసెంట్‌గా కేరళ సెషన్స్ కోర్టు ‘వరాహ రూపం..’ పాటను రద్దు చేయాలంటూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
సినిమాకి ప్రాణమైన ఆ పాటను నిలిపేసినా, సినిమాకి వసూళ్లు తగ్గడం లేదు. అలాగే, తెలుగు రాష్ర్టాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ వంటి సినిమాలకు సైతం వీక్ డేస్‌లో వసూళ్లు తగ్గిపోయిన రోజులివి. ఆ మాటకొస్తే, సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలు సైతం ఒక్క వారానికి మాత్రమే పరిమితమైపోయిన రోజులు కూడా చూస్తున్నాం. అలాంటిది ‘కాంతారా’ మ్యాజిక్ ఏంటో తెలీదు.. వసూళ్ల వరద ఇంకా కొనసాగుతూనే వుంది. ట్రేడ్ పండితుల్ని సైతం విస్మయానికి గురి చేస్తోంది ‘కాంతారా’ సక్సెస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com