విజయవాడ-షార్జాకు విమాన సర్వీస్ ప్రారంభం...
- November 01, 2022
విజయవాడ: గన్నవరం విమానాశ్రయం నుంచి షార్జాకు బయల్దేరిన మొదటి ఎయిర్ ఇండియా విమానానికి విశేష స్పందన లభించింది.సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాయంత్రం 4.30 గంటలకు తిరుగు ప్రయాణమైంది.50 మంది ప్రయాణికులతో వచ్చిన విమానం 122 మందితో తిరుగు ప్రయాణమైంది.ఈ విమానానికి విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు.మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని నాని జెండా ఊపారు.అనంతరం ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లు ఇచ్చారు.ఈ అంతర్జాతీయ విమానం వారంలో రెండు రోజులు సోమ, శనివారాల్లో రాకపోకలు సాగిస్తుంది. విమాన సర్వీసు ప్రారంభించటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ అంతర్జాతీయ సర్వీసు ద్వారా గల్ఫ్ దేశాలకు విజయవాడ నుంచి కనెక్టివిటీ ఏర్పడింది.దుబాయ్, అబుధాబి, రస్ ఆల్‌ఖైమా వంటి ఎమిరేట్లకు మరియు అరబ్ దేశాలకు చేరుకునే వీలు కలిగింది.
విజయవాడ నుంచి షార్జాకు అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభించటానికి ఎంతో కృషి చేశాం.సర్వీసు ప్రారంభం కావటం ఆనందంగా ఉంది.ప్రస్తుతం వారంలో రెండు రోజుల పాటు నడుస్తుంది.ఆక్యుపెన్సీ పెరిగితే డైలీ నడుపుతాం.ఇప్పటికే విజయవాడ నుంచి మస్కట్‌కు అంతర్జాతీయ సర్వీసు ప్రారంభించాం.విజయవాడకు కువైట్ నుంచి మరో రెండు వన్‌వే విమానాలు నడుస్తున్నాయి.రానున్న రోజుల్లో బ్యాంకాక్, మలేషియా, సింగపూర్‌కు కూడా నడుపుతాం.-వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ
షార్జాకు అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం కావటం ఆనందంగా ఉంది.2014కు ముందు ఈ ఎయిర్‌పోర్టు బస్టాండ్ కంటే తక్కువగా ఉండేది.గత ముఖ్యమంత్రి చంద్రబాబు,కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు హయాంలో అభివృద్ధి చెందింది.విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూములను సేకరించి అప్పగించాం.టీడీపీ ఆధ్వర్యంలో విమానాశ్రయం భూముల కోసం రూ.2,400 కోట్లు ఖర్చు చేశాం.ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం మరో రూ.1,000 కోట్లు ఖర్చు చేశాం.రూ.130 కోట్లతో పాత టెర్మినల్‌ను అంతర్జాతీయ టెర్మినల్‌గా అభివృద్ధి చేశాం. టాటా కుటుంబంతో ఉన్న సత్సంబంధాల కారణంగా విజయవాడకు మరిన్ని సర్వీసులు తీసుకురావటానికి కృషి చేస్తా.-కేశినేని శ్రీనివాస్, విజయవాడ ఎంపీ
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







