మొన్న తమన్నా, ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్.!
- November 01, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజై, మంచి విజయం అందుకుంది. ఓటీటీ ప్రేక్షకుల్ని ఈ సినిమా కథ, కథనం బాగా ఆకట్టుకున్నాయ్.
తమన్నా తన నటనతో ఓటీటీ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఓటీటీలో మంచి క్లీన్ అండ్ ఎంటర్టైనర్ మూవీగా ‘బబ్లీ బౌన్సర్’ గుర్తింపు దక్కించుకుంది. మాధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈయనే మరో సినిమా తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా కోసం ‘కొత్త బంగారు లోకం’ ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్‌ని లీడ్ రోల్‌గా ఎంచుకున్నారాయన.
‘లాక్డౌన్’ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. లాక్డౌన్ ఎంతో మంది బతుకుల్ని ఛిద్రం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి కొన్ని హార్ట్ టచ్చింగ్ క్యారెక్టర్లను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు మాధుర్ భండార్కర్.
శ్వేతా బసు ప్రసాద్ ఈ సినిమాలో వేస్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే శ్వేతా బసు ప్రసాద్ పలు ఓటీటీ కంటెంట్లతో దూసుకెళుతోంది. యాక్టింగ్ స్కోపున్న రోల్స్‌తో ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ రోల్స్, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, కెరీర్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటోంది. మరి, తాజా మూవీ ‘లాక్డౌన్’ శ్వేతా బసు ప్రసాద్‌కి ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







