అభిరామ్‌ని హీరో అంటే ఒప్పుకోనంటోన్న డైరెక్టర్ తేజ.!
- November 01, 2022
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేష్ తర్వాత రానా హీరోగా పరిచయమై తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న రానా సోదరుడు అభిరామ్ కూడా హీరోగా డెబ్యూ చేయబోతున్నాడు.
అభిరామ్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్న డైరెక్టర్ మరెవరో కాదు, విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ . ఈయన దర్శకత్వంలో ఎంతో మంది నటీనటులు ఇండస్ర్టకీ పరిచయమయ్యారు. మంచి స్థానంలో వున్నారు.
ఇక, ఇప్పుడు అభిరామ్ వంతు వచ్చింది. ‘అహింస’ అనే సినిమాతో తేజ, అభిరామ్‌ని పరిచయం చేస్తున్నాడు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అభిరామ్‌ని హీరో అని అభివర్ణించడం తనకి నచ్చలేదని కుండ బద్దలు కొట్టేశారు డైరెక్టర్ తేజ.
అదేంటీ.! హీరోని హీరో అనకుండా ఎలా.? అంటారా.? ‘అహింస’ అనే సినిమాలో 20 పాత్రలున్నాయ్. ఆ పాత్రల్లో అభిరామ్ పొత్ర ఒకటి. అంతే కానీ, హీరో అని అతన్ని సంబోధించొద్దు అంటున్నారు. ఆయనంతే అదో టైపు. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగానే మాట్లాడతాడు. అభిరామ్ విషయంలో తేజ చేసిన వ్యాఖ్యలు దగ్గుబాటి ప్యాన్స్‌ని విస్మయానికి గురి చేస్తున్నాయ్. ఇక సినిమా విషయానికి వస్తే, తేజ మార్కు హింసాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







