కెనడాలో కారు యాక్సిడెంట్‌కి గురైన సీనియర్ హీరోయిన్ రంభ.!
- November 01, 2022
సీనియర్ హీరోయిన్ రంభ కారు ప్రమాదంలో గాయపడ్డారు. కెనడాలో ఈ ప్రమాదానికి గురయ్యారు సీనియర్ నటి రంభ. పిల్లల్ని స్కూలు నుంచి తీసుకొస్తుండగా, టొరంటోలో ఈ ప్రమాదం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్థావించడంతో అభిమానులకు విషయం తెలిసింది.
అయితే, ఈ ప్రమాదంలో తాను స్వల్ప గాయాలతోనే బయటపడ్డానని రంభ పేర్కొన్నారు. కానీ, తన కూతురు సాషాకి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాప తొందరగా కోలుకోవాలని ప్రార్ధించమని అభిమానులను కోరారామె.
‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రంభ. 19 ల కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగారు రంభ. సీనియర్ హీరోలందరి సరసనా బోలెడన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాగే, ఎన్టీయార్ తదితర హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిశారు.
కెనడాకి చెందిన వ్యాపారవేత్తతో 2010లో రంభ వివాహం జరిగింది. వివాహానంతరం ఆమె సినిమాలకు దూరంగా వున్నారు. కెనడాలోనే వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు కాగా, అందులో ఒక చిన్నారి సాషాని స్కూల్ నుంచి తీసుకొస్తుండగానే కారు ప్రమాదానికి గురి అయినట్లు తెలుస్తోంది.
తృటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రంభ.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







