బహ్రెయిన్ పబ్లిక్ బస్ నెట్వర్క్ విస్తరణ
- November 02, 2022
బహ్రెయిన్: నవంబర్ 6 నుండి బహ్రెయిన్‌లోని అన్ని ప్రాంతాలకు సేవలందించేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ నెట్వర్క్ ని విస్తరించి.. కొత్త లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముహరక్ గవర్నరేట్, ఇసా టౌన్, సల్మాన్ సిటీ, బుదయ్యా, సార్‌లోని అన్ని పట్టణాలతోపాటు అదనంగా మనామా, సిత్రా, రిఫా, సదరన్ గవర్నరేట్ కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ కవరేజీలు కొత్త ప్రణాళికలో భాగంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ అండ్ స్టడీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ హుస్సేన్ అలీ యాకూబ్ మాట్లాడుతూ.. బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ సమన్వయంతో వినియోగదారుల ప్రయాణాలను సులభతరం చేయడానికి ప్రజా రవాణా సేవలను అందించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని కల్పించుందకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు, మహిళలకు ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేశామన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!







