చికోటి ప్రవీణ్ ఫామ్‌హౌస్‌లో ఆర్జీవీ

- November 02, 2022 , by Maagulf
చికోటి ప్రవీణ్ ఫామ్‌హౌస్‌లో ఆర్జీవీ

హైదరాబాద్: చికోటి ప్రవీణ్ ఫామ్‌హౌస్‌లో సందడి చేసారు సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కొద్దీ రోజుల క్రితం చికోటి ప్రవీణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన సంగతి తెలిసిందే. క్యాసినో నిర్వహిస్తూ కోట్ల రూపాయల హవాలాకు పాల్పడుతున్నాడని, ప్రవీణ్ తో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని, అలాగే సినీ పరిశ్రమ కు సంబదించిన వ్యక్తుల తోనే ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. మూడు రోజుల పాటు ఈడీ ..ప్రవీణ్ ను విచారించడం కూడా జరిగింది. ఆ తర్వాత సైలెంట్ అయిపొయింది.

తాజాగా చికోటి ప్రవీణ్ ఫామ్‌హౌస్‌లో డైరెక్టర్ సందడి చేయడం ఇప్పుడు చర్చ గా మారింది. ప్రవీణ్‌ ఫామ్‌హౌజ్‌కి వెళ్లి మరీ ఆయన్ను కలిశారు. అక్కడ ఉన్న జంతువులు, పక్షులను చికోటి ప్రవీణ్.. వర్మ కి చూపించారు. వాటిని ఆసక్తిగా చూసిన వర్మ.. చికోటిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆ తర్వాత ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేసారు వర్మ. ‘వైల్డ్‌ మ్యాన్‌ చికోటి ప్రవీణ్‌తో కలిసి అతని వైల్డ్‌ పామ్‌హౌజ్‌ని సందర్శించాను. అతని జంతువుల సేకరణ నన్ను ఆకట్టుకుంది. చికోటి ప్రవీణ్‌కు జంతువులపై అమితమైన ప్రేమ ఉంది. అడవి జంతువులపై చికోటి కంటే ఎక్కువ ప్రేమ చూపే వ్యక్తిని నేను చూడలేదు’ అని వర్మ ట్వీట్ చేశారు.

రీసెంట్ గా వర్మ వ్యూహం అనే మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ప్రవీణ్ కలవడం వెనుక అసలు రహస్యం ఏంటి..? ప్రవీణ్ ఫై వర్మ ఏమైనా సినిమా చేస్తాడా..? అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com