పర్యాటకులు, విజిటర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న యూఏఈ
- November 03, 2022
యూఏఈ: పర్యాటకులు, విజిటర్లకు సంబంధించి యూఏఈ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓవర్స్టేకు విధించే జరిమానాను సగానికి తగ్గించింది.ఇంతకు ముందు రోజుకు 100 దిర్హాములుగా ఉన్న ఈ జరిమానాను ఇప్పుడు 50 దిర్హాములుగా చేసింది.ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్షిప్, కస్టమ్స్ అండ్ పోస్ట్ సెక్యూరిటీ ప్రకటన చేసింది.ఇక పై పర్యాటకులు, విజిటర్లు ఓవర్స్టేకు పర్ డే 50 దిర్హాములు చెల్లిస్తే సరిపోతుందని తన ప్రకటనలో పేర్కొంది.
ఈ సందర్భంగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్షిప్, కస్టమ్స్ మరియు పోస్ట్ సెక్యూరిటీ(ICP) మరో కీలక ప్రకటన చేసింది.వీసా విధానంలో కొత్త సవరణల ప్రకారం విదేశీ నివాసితుల ఓవర్‌స్టే జరిమానాను రోజుకు 25 దిర్హాములు నుండి 50 దిర్హాములకు పెంచినట్లు ప్రకటించింది.కేబినెట్ రిజల్యూషన్ నం.65 ఆఫ్ 2022 ప్రకారం జరిమానాలను సవరించినట్లు పేర్కొంది.ఇక ఈ జరిమానాల చెల్లింపులను కూడా సులభతరం చేసినట్లు వెల్లడించింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఎలక్ట్రానిక్ సర్వీసుల ద్వారా చాలా సులభంగా జరిమానాలు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు ఐసీపీ తెలిపింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







