స్వామి బ్రహ్మవిహారిదాస్‌తో సమావేశమైన అల్ నహ్యాన్
- November 03, 2022
యూఏఈ: యూఏఈ విదేశాంగ, అంతర్జాతీయ సహకార మంత్రి హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతీయ సమాజానికి దీపావళి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రైవేట్ ప్యాలెస్ లో BAPS కు చెందిన స్వామి బ్రహ్మవిహారిదాస్ అతని బృందంతో అల్ నహ్యాన్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వారు BAPS హిందూ మందిర్ అభివృద్ధి, పురోగతి తదితర అంశాలపై చర్చించారు.అబుధాబిలో చారిత్రాత్మక హిందూ మందిర నిర్మాణం ద్వారా ప్రేమ, సహనం, సామరస్యం వెల్లివిరియాలని అల్ నహ్యాన్ ఆకాంక్షించారు. BAPS కార్యక్రమాలకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హిస్ హైనెస్ స్పష్టం చేశారు.


తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







