మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి
- November 04, 2022
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున బేతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
టవేరా కారులో ఉన్న వారంతా మహారాష్ట్రలోని అమరావతి నుంచి తమ ఇంటికి వెళ్తున్నారు. టవేరా డ్రైవర్‌కు మార్గమధ్యలో నిద్రరావడంతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టిందని బేతుల్ ఎస్పీ సిమ్లా ప్రసాద్ తెలిపారు. ప్రమాదంలో కారు భారీగా ధ్వంసమైంది. ప్రాణాలు కోల్పోయిన వారు రాష్ట్రానికి చెందినవారా.. లేక వేరే ప్రాంతం వ్యక్తులా అనేది తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు







