ఫిఫా ప్రపంచ కప్: టిక్కెట్ లేని అభిమానులకు గుడ్ న్యూస్

- November 05, 2022 , by Maagulf
ఫిఫా ప్రపంచ కప్: టిక్కెట్ లేని అభిమానులకు గుడ్ న్యూస్

ఖతార్: ఫిఫా ప్రపంచ కప్‌కు టిక్కెట్ కొనుగోలు చేయని అభిమానులకు డిసెంబర్ 2 నుంచి(గ్రూప్ దశ తర్వాత) అనుమతి ఇవ్వాలని ఖతార్ నిర్ణయించింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రపంచ కప్ భద్రతా బలగాల అధికారిక ప్రతినిధి కల్నల్ జబర్ హమ్మౌద్ జబర్ అల్ నుయిమి మీడియాతో తెలిపారు.  టికెట్ లేని అభిమానులు హయ్యా ప్లాట్‌ఫారమ్ లేదా హయ్యా మొబైల్ యాప్ ద్వారా ఖతార్ లోకి ప్రవేశించడానికి అవసరమైన హయ్యా కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలాగే ఫుట్ బాల్ అభిమానులు 16000 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఉచిత హెల్ప్‌లైన్‌ను యాక్సెస్ చేయవచ్చని, అవసరమైనప్పుడు వైద్య సంరక్షణను పొందడం గురించి సమాచారం పొందవచ్చని వివరించాడు. హయ్యా హాట్‌లైన్ (800 2022) ఇప్పటికే తన సేవలు ప్రారంభించిందన్నారు. ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరిగే 21 రోజులలో  అభిమానుల ట్రాన్స్ పోర్టుకు ప్రతి 165 సెకన్లకు ఒక మెట్రో రైలు నడుస్తుందన్నారు. దీనితోపాటు 3,600 బస్సులు అభిమానులకు నిరంతరం సేవలు అందిస్తాయన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com