బెంగళూరుకు నేరుగా విమానాన్ని ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్
- November 05, 2022
కువైట్: భారతదేశంలోని బెంగళూరు నగరానికి జజీరా ఎయిర్వేస్ తన మొదటి డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించింది. జజీరా ఎయిర్వేస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయం నుండి మొదటి కార్యదర్శి డాక్టర్ వినోద్ గైక్వాడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జజీరా ఎయిర్వేస్ అధికారులు, కువైట్‌లోని వివిధ కర్ణాటక సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు.
కువైట్ విమానాశ్రయం నుండి ఫ్లైట్ నంబర్ J9 431 సాయంత్రం 6:00 గంటలకు బెంగళూరుకు బయలుదేరి 01:15 గంటలకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం 02:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 04:50కి కువైట్ చేరుకుంటుంది.
జజీరా విమానం కువైట్ నుండి బెంగళూరుకు గురువారం, శనివారం సాయంత్రం 6:00 గంటలకు రెండు వీకెండ్ సర్వీసులను ఆపరేట్ చేయనుంది. బెంగళూరు నుండి తిరుగు ప్రయాణంలో శుక్రవారం, ఆదివారం తెల్లవారుజామున 2:00 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4:50 గంటలకు కువైట్ చేరుకుంటాయని జజీరా ఎయిర్వేస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!







