లాల్ సలామ్ అంటోన్న సూపర్ స్టార్ రజనీకాంత్.!
- November 05, 2022
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కొత్త సినిమా లాంఛ్ అయ్యింది. సూపర్ స్టార్ ముద్దుల తనయ ఐశ్వర్యా రజనీకాంత్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా లాంఛింగ్ డే సందర్భంగా, టైటిల్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘లాల్ సలామ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్ని రోజులుగా ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా రాబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయ్.
ఆ వార్తల సారాంశం ఇదే. తాజాగా ఈ ప్రాజెక్ట్ కన్‌ఫామ్ చేశారు. అయితే, ఈ సినిమాలో రజనీకాంత్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషించట్లేదట. జస్ట్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారట. తమిళ యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ పోషించనున్నారు. కాగా, టైటిల్ లోగోతో పాటూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని బట్టి ఇది క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా వుండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







