తెలుగు భాష పరిరక్షణకు కృషి...
- April 21, 2016
తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు, కవి తనికెళ్ళ భరణి అన్నారు. మం డలంలోని కారుమూరులో గురువారం ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి న ఆయన తెలుగు పండితులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా తనికెళ్ళ మాట్లాడుతూ రెండు రాషా్ట్రల్లో కమ్మని తెలుగు భాషను పరిరక్షించేందుకు పండితులు నడుం బిగించాలన్నారు. ప్రస్తుత తరుణంలో సాహిత్యం, తెలుగు భాషపై ప్రజల్లో మక్కు వ తగ్గుతుందన్నారు. తెలుగు భాషా సంస్కృ తి, సంప్రదాయాలకు దేశంలో ప్రత్యేక గుర్తిం పు ఉందన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసి తెలుగు భాషను పెంపొందించే విధం గా కృషి చేయాలన్నారు. ఇరు రాషా్ట్రల్లో ప్రభుత్వాలు తెలుగు భాషపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రస్తుతం ఇంగ్లీషు అవసరమే అయినా మాతృభాష తెలుగుపై విద్యార్థులకు సంపూర్ణంగా అవగాహన కల్పించే విధంగా విద్యార్థులకు బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మిత్రుడైన నల్లూరు ఆధిత్య భగవాన్ కుమార్తె లక్ష్మీ వైష్ణవి వివాహానికి హాజరైన ఆయన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు నల్లూరు యోగానంద్, భట్టాచార్యులు, హరి అన్నయ్యశాస్ర్తి, మన్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









