సౌదీ జాతీయ క్రీడల్లో రాణించిన తెలుగు వాసి

- November 07, 2022 , by Maagulf
సౌదీ జాతీయ క్రీడల్లో రాణించిన తెలుగు వాసి

సౌదీ: సౌదీ అరేబియా జాతీయ క్రీడల చరిత్రలో తొలిసారిగా బ్యాండ్మీంటన్ బాలుర విభాగంలో నెల్లూరుకు చెందిన 17 ఏళ్ళ మహాద్ స్వర్ణ పతకం గెలుపొందాడు.సౌదీ అరేబియా ఒలింపిక్ కమిటీ ఉపాధ్యక్షుడు, సౌదీ క్రీడల డైరెక్టర్ ప్రిన్స్ ఫహాద్ బిన్ జలవీ బిన్ అబ్దుల్ అజీజ్ చేతులమీదుగా బహుమతి కింద ఒక మిలియన్ రియాల్స్ ( సుమారు రూ. 2,18,60,000) బహుమానాన్ని అందుకున్నాడు. అలాగే బాలికల విభాగంలో కేరళకు చెందిన ఖదీజా కొతూరు అనే బాలిక కూడా స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు సృష్టించింది.

నెల్లూరు నగరం రాంలింగపూర్ వీధికి చెందిన శేఖ్ షాహీద్, షాకీరా బేగంల కుమారుడయిన మహాద్.. ప్రస్తుతం రియాధ్ నగరంలోని భారతీయ యన్.యం.స్.ఇ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నారు. ఈ సందర్భంగా మహాద్ మాట్లాడుతూ.. తన విజయానికి హైదరాబాద్‌లోని గోపిచంద్ బ్యాండ్మింటెన్ అకాడమీలో శిక్షణ మెళకువలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. సౌదీ అరేబియా పక్షాన ఒలంపిక్స్ పోటీలలో పాల్గొని విజయం సాధించడం తన లక్ష్యం అని తెలిపారు.

మహాద్ తండ్రి షాహీద్ అర్కిటెక్ట్ కాగా.. తల్లి షాకీరా బేగం ఇంజినీరింగ్ పట్టభద్రురాలు. మహాద్ అన్న ఫైసల్ షా కూడా బ్యాండ్మింటన్ క్రీడాకారుడు. ప్రస్తుతం యం.బి.బి.యస్ చదువుతున్నాడు. సోదరి ఖతీజా షాహీద్ కూడా ప్రస్తుతం ఇండియాలో యం.బి.బి.యస్ చదువుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com