సరికొత్త యాక్షన్ షురూ చేసిన నాగశౌర్య.!
- November 07, 2022
పక్కింటబ్బాయ్‌లా ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మొన్నా మధ్య ‘వరుడు కావలెను’ సినిమాతో ఓ మోస్తరు సోదిలో నిలిచిన ఈ కుర్రహీరో, తాజాగా ‘కృష్ణ వ్రింది విహారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ కృష్ణుడు నిలవలేకపోయాడు. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో ‘నారీ నారీ నడుమ మురారి’, ‘పోలీసులకు హెచ్చరిక’ తదితర మూడు ప్రాజెక్టుల వరకూ వున్నాయ్. దాంతో పాటూ, సరికొత్తగా ఓ యాక్షన్ సినిమాకి షురూ చేశాడు నాగశౌర్య.
ఎస్. ఎస్. అరుణాచలం దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని వెరీ లేటెస్టుగా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేవారు. యాక్షన్‌తో పాటూ, పక్కా ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమా వుండబోతోందనీ తెలుస్తోంది.
ఒకప్పుడు నాగశౌర్య సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే లెక్కలుండేవి. కానీ, ఇప్పుడు లెక్కలు మారిపోయాయ్. మళ్లీ ఆ లెక్కలు జమా కావాలంటే, అర్జెంటుగా నాగశౌర్యకి ఓ సూపర్ హిట్టు పడాల్సిందే. ప్రస్తుతుం శౌర్య చేతిలో వున్న ప్రాజెక్టుల్లో అలాంటిది ఏ ప్రాజెక్ట్ అవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







