సీనియర్ నటుడు అర్జున్‌కి ఆటిట్యూడ్ చూపించిన విశ్వక్ సేన్.!
- November 07, 2022
సీనియర్ నటుడు అర్జున్ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాలో హీరోగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించాలి. అర్జున్ తనయ ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాతో తెలుగులోకి ఇంట్రడ్యూస్ కానుంది.
అంతా బాగానే వుంది. కానీ, షూటింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుందన్న టైమ్‌లో విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకున్నాడు. దాంతో టీమ్ మొత్తం షాక్‌కి గురైంది. హీరో కమ్ డైరెక్టర్ అర్జున్ ఈ విషయంలో చాలా ఆవేదనకు గురయ్యారు. విశ్వక్ సేన్ తీరును తప్పు పడుతూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.
స్ర్కిప్టులో ఏమైనా మార్పులు వుంటే చెప్పాలి.. లేదా, ముందే ఈ ప్రాజెక్ట్‌లో నటించడం తనకిష్టం లేదని చెప్పాలి.. అంతేకానీ, అంతా సిద్ధం చేసుకున్నాకా ఇలా చేయడం ఏమీ బాగా లేదు. విశ్వక్ సేన్‌కి డైరెక్టర్లూ, ప్రొడ్యూసర్లు అంటే అస్సలు రెస్పెక్టే లేదు.. అని ఫైర్ అయ్యారు. అంతేకాదు, ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ తీరును ఎండగట్టేశారాయన.
తాజాగా ఈ విషయంలో విశ్వక్ సేన్ రెస్పాండ్ అయ్యాడు. తాను ఏ సినిమా చేసినా ఫస్ట్ డే షూటింగ్‌కి చాలా కాన్ఫిడెంట్‌గా వస్తాననీ, కానీ, ఎందుకో అర్జున్ గారితో ఆ కంఫర్ట్ తనకు దొరకలేదనీ, ముందు ముందు ఇంకా ఇబ్బంది అయిపోతుందనే తాను అలా చేశాననీ చెప్పాడు. తానేం సాధారణ నటుడ్ని కాదనీ, నాలుగైదు సినిమాల్లో నటిస్తూ, ఓ సినిమాకి డైరెక్షన్ కూడా చేస్తున్నాననీ ఎప్పటిలాగే ఆటిట్యూడ్ చూపించాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.
యంగ్ హీరో రెస్పాన్స్ ఏమంత కన్విన్సింగ్‌గా లేదంటూ విశ్వక్‌ని పలువురు సినీ ప్రియులు తప్పు పడుతున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







