పాఠశాల బస్సుల్లో విద్యార్థులు మాస్కులు పెట్టుకోవాలా?

- November 08, 2022 , by Maagulf
పాఠశాల బస్సుల్లో విద్యార్థులు మాస్కులు పెట్టుకోవాలా?

యూఏఈ: కొవిడ్-19 ఆంక్షలను యూఏఈ ఎత్తివేసింది. అయితే, విద్యార్థులు ఇకపై బస్సుల్లో పాఠశాలలకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం ఉందా. దీనిపై అటు పేరెంట్స్, ఇటు స్కూల్స్ యాజమాన్యాల్లో అనేక సందేహాలు ఉన్నాయి. కోవిడ్ -19 పరిమితులను ఎత్తివేసిన తర్వాత.. అన్ని ఓపెన్, క్లోజ్డ్ సౌకర్యాలలో మాస్కులు ధరించడం ఆప్షనల్ గా మారింది. ఈ నిర్ణయాన్ని పాఠశాలల సంఘాలు స్వాగతిస్తున్నాయి.

అమిటీ స్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ముందుజాగ్రత్త చర్యగా, పాఠశాల బస్సులో ప్రయాణించేటప్పుడు విద్యార్థులు మాస్క్ ధరించమని చెబుతున్నట్లు పేర్కొన్నారు. తమ విద్యార్థులలో ఎక్కువ మంది తరగతి గదిలో మాస్క్ ధరించరు. అయినప్పటికీ, మూసి ఉన్న ప్రదేశాలలో మాస్కు ధరించాలని సూచిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు.

క్రెడెన్స్ హైస్కూల్ సీఈఓ- ప్రిన్సిపల్ దీపికా థాపర్ సింగ్ మాట్లాడుతూ.. స్కూల్ బస్సులలో ప్రయాణించేటప్పుడు తమ విద్యార్థులు, సిబ్బంది ఇకపై మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఎవరైనా మాస్క్ ధరించాలని అనుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఒక పిల్లవాడు జలుబు/దగ్గుతో బాధపడుతుంటే, అందరి భద్రత కోసం మాస్క్ ధరించాలని ఆమె సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com