ఫిఫా ప్రపంచకప్: ఇండియాలో ప్రైవేట్ జెట్‌లకు ఫుల్ డిమాండ్

- November 08, 2022 , by Maagulf
ఫిఫా ప్రపంచకప్: ఇండియాలో ప్రైవేట్ జెట్‌లకు ఫుల్ డిమాండ్

ఖతార్: మిడిల్ ఈస్ట్‌లో జరిగే మొదటి ఫిఫా ప్రపంచ కప్ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఖతార్‌లో జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో ప్రైవేట్ జెట్ లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నది. ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లకు హాజరయ్యేందుకు బిజినెస్ చార్టర్ విమానాలను బుక్ చేసుకునేందుకు భారతదేశపు అధిక నెట్-వర్త్ వ్యక్తులు(HNI) ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేట్ ఎయిర్ ఫెయిర్ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ చార్టర్ విమానాలు ఎక్కువగా బుక్ అవుతున్నాయని ప్రైవేట్ జెట్ల ప్రతినిధులు చెబుతున్నారు. ఖతార్‌లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూసేందుకు భారతదేశానికి చెందిన హెచ్‌ఎన్‌ఐలలో ఒకరు అత్యంత వేగవంతమైన 30-సీట్ల చార్టర్ విమానాన్ని బుక్ చేశారని ఢిల్లీకి చెందిన ఎయిర్ చార్టర్ సోర్సింగ్ కంపెనీ అధికారి తెలిపారు. ఫిఫా మ్యాచ్‌ల కోసం ఖతార్, దుబాయ్‌లకు గరిష్ట ట్రిప్ అభ్యర్థనలు అందుతున్నాయని ఇన్‌స్టా చార్టర్ వ్యవస్థాపకుడు కెప్టెన్ అభిషేక్ సిన్హా పేర్కొన్నారు. సాధారణంగా 30 సీటర్ విమానాల ప్రైవేట్ చార్టర్‌లు ఢిల్లీ నుండి ఖతార్ (దోహా)కి వన్-వే ట్రిప్‌కు దాదాపు 5 గంటలు పడుతుంది. ఆపరేటర్లు రెండు-మార్గాల ధరల ప్రకారం టికెటింగ్ ఫెయిర్లను వసూలు చేస్తుంటారు. విమానం హోల్డింగ్, విమానాశ్రయ రుసుము, సిబ్బంది ఛార్జీలను కలుపుకుంటే ధరలు మరింత పెరుగుతాయి. 30-సీట్ల విమానంలో దోహాకు టూ వే ప్రయాణానికి దాదాపు 5 - 6 మిలియన్ల ఖర్చువుతాయి. ప్రస్తుతం పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ ధరల్లో దాదాపు 40 - 50 శాతం పెరుగుదల ఉంటుందని ప్రైవేట్ జెట్ల ఆపరేటర్లు చెబుతున్నారు. ఇటీవల  టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రధాన భారతీయ నగరాలు ముంబై, హైదరాబాద్, చెన్నై నుండి ఖతార్ (దోహా)కి 20 కొత్త  విమానాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఖతార్‌లో జరగనున్న ఫుట్‌బాల్ మ్యాచులకు హాజరయ్యే అభిమానుల డిమాండ్ ను ఇది తీర్చుతుందని భావిస్తున్నట్లు ట్రావెల్ కన్సల్టెంట్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com