యూఏఈలో 5 సంవత్సరాల రెసిడెన్సీ వీసాల జారీ ప్రారంభం

- November 08, 2022 , by Maagulf
యూఏఈలో 5 సంవత్సరాల రెసిడెన్సీ వీసాల జారీ ప్రారంభం

యూఏఈ: 5 సంవత్సరాల రెసిడెన్సీ వీసాల జారీని యూఏఈ ప్రారంభించింది.సెప్టెంబరు 5 నుండి అమలులోకి వచ్చిన విదేశీయుల ప్రవేశం, నివాసంపై కొత్త చట్టం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా వీసాల జారీని యూఏఈ ప్రారంభించింది. ఎమిరాటీ తల్లుల పిల్లలకు ఐదేళ్ల రెసిడెన్సీ వీసాల కాలపరిమితి గతంలో 3 సంవత్సరాలుగా ఉండేది. 2022 జూన్ లో ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దేశంలో నివసిస్తున్న ఎమిరాటీ తల్లుల పిల్లలకు విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి ఇతర పౌరుల మాదిరిగానే ప్రయోజనాలను మంజూరు చేస్తూ ఒక తీర్మానాన్ని జారీ చేశారు.

యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ఏడాది జూలైలో కేబినెట్ వీసాల జారీలో మార్పులకు ఆమోదం తెలిపింది.  ప్రపంచ వ్యాప్తంగా పేరున్న వ్యక్తులు, కంపెనీల వ్యవస్థాపకులు, అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించడానికి యూఏఈ వీసా సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే అత్యంత ప్రజాదరణ పొందిన గోల్డెన్ వీసా(ఐదేళ్ల పర్యాటక వీసా), ఐదేళ్ల గ్రీన్ వీసాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com