సింగిల్ ఎంట్రీ విజిట్ వీసాల చెల్లుబాటును 3 నెలలకు పొడిగించిన సౌదీ

- November 09, 2022 , by Maagulf
సింగిల్ ఎంట్రీ విజిట్ వీసాల చెల్లుబాటును 3 నెలలకు పొడిగించిన సౌదీ

రియాద్: సింగిల్ ఎంట్రీ విజిట్ వీసాల గడువును మూడు నెలలకు పొడిగించేందుకు మంగళవారం సౌదీ అరేబియా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎలాంటి రుసుము లేకుండా ట్రాన్సిట్ వీసాల బస వ్యవధి కూడా 96 గంటలకు పొడిగించారు. అల్-యమామా ప్యాలెస్‌లో రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ వీక్లీ సెషన్ లో ఈ మేరకు వీసా మార్పులను ఆమోదించారు. ప్రస్తుతం సింగిల్-ఎంట్రీ ఫ్యామిలీ విజిట్ వీసాలు 30 రోజులు చెల్లుబాటు అవుతుండగా, మల్టిపుల్ ఎంట్రీ వీసాలు 90 రోజులపాటు చెల్లుబాటు అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com