ప్రపంచ కప్ అభిమానుల కోసం ‘ఒమన్ ఎయిర్’ ప్రత్యేక ధరలు

- November 09, 2022 , by Maagulf
ప్రపంచ కప్ అభిమానుల కోసం ‘ఒమన్ ఎయిర్’ ప్రత్యేక ధరలు

ఒమన్: ఖతార్ ఫుట్‌బాల్ మ్యాచులను చూసే జీసీసీ దేశాల అభిమానుల కోసం ఒమన్ సుల్తానేట్ జాతీయ విమానయాన సంస్థ అయిన ఒమన్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలను ప్రకటించింది. GCC జాతీయులు, నివాసితులు అందరూ ప్రత్యేక ధర కలిగిన టిక్కెట్‌లను ఎకానమీ క్లాస్‌కు కేవలం OMR 149, బిజినెస్ క్లాస్ కోసం OMR 309 వద్ద కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. మస్కట్ మీదుగా విమానాలను ఎంచుకునే ఫుట్‌బాల్ అభిమానులు ఒమన్ ఎయిర్ రోజువారీ మ్యాచ్ డే షటిల్ ఫ్లైట్‌లలో ఒకదానిలో కేవలం OMR 49 రిటర్న్‌తో మ్యాచ్‌కి వెళ్లవచ్చు. మస్కట్ -దోహాల మధ్య 21 నవంబర్ నుండి 3 డిసెంబర్ 2022 వరకు షటిల్ సర్వీసులు పనిచేయనున్నాయి. ఎయిర్ టిక్కెట్లను బుక్ చేసుకునే అతిథులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే హయ్యా కార్డ్, మ్యాచ్ టిక్కెట్‌ని కలిగి ఉండాలి. ఇతర నిబంధనలు, షరతులు కోసం వెబ్ సైట్ http://www.omanair.com ను చూడాలని సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com