కార్తి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్.! జోరు పెంచిందిగా.!

- November 09, 2022 , by Maagulf
కార్తి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్.! జోరు పెంచిందిగా.!

ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ దశ తిరిగినట్లే కనిపిస్తోంది. ఎప్పుడో తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకోవల్సిన ఈ ముద్దుగుమ్మ ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది అప్పుడు. 
కానీ ఇప్పుడు మళ్లీ హవా పెంచుతోంది. రీసెంట్‌గా తెలుగులో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. అడల్ట్ కంటెంట్ అనిపించుకున్నా.. ఓకే ఓ మోస్తరు హిట్ లిస్టులో పడేశారీ సినిమాని. దాంతో అనూకి బాగానే వర్కవుట్ అయ్యిందని చెప్పొచ్చు.
ఇక, తమిళంలో అప్పుడెప్పుడో విశాల్ సరసన ఓ సినిమాలో నటించింది. ఆ తర్వాత పెద్దగా తమిళ సినిమాపై ఫోకస్ పెట్టలేదీ భామ. తాజాగా తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన కార్తి సరసన ఛాన్స్ కొట్టేసింది. రాజు మురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ బ్యానర్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 
ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. పెద్ద బ్యానర్, సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన కార్తి సినిమాలో ఛాన్స్ అంటే, అనూ కెరీర్ మళ్లీ గాడిన పడ్డట్లే అనిపిస్తోంది. చూడాలి మరి, తెలుగులో కూడా ఇకపై అనూ ఇమ్మాన్యుయేల్ క్రేజీ ఆఫర్లు పడుతుందేమో.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com