మీకు అర్ధమవుతోందా.? చెప్పాలనిపించింది చెప్పాను.! రష్మికా మండన్నా.!

- November 09, 2022 , by Maagulf
మీకు అర్ధమవుతోందా.? చెప్పాలనిపించింది చెప్పాను.! రష్మికా మండన్నా.!

కన్నడ కుట్టీ రష్మికా మండన్నా తెలుగులో హీరోయిన్‌గా మంచి క్రేజ్ దక్కించుకుంది. అతి తక్కువ కాలంలోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రష్మికకు స్పెషల్ క్రేజ్ వుంది.
అలాగే, ఇప్పుడిప్పుడే తమిళ, హిందీ భాషల్లోనూ రష్మిక టాప్ రేంజ్‌కి వెళ్లేందుకు జోరు చూపిస్తోంది. కాగా, ఎంత క్రేజ్ వున్నా, రష్మిక అస్తమానూ నెగిటివిటీకి టార్గెట్ అవుతూ వస్తుంది. ఒకింత పబ్లిసిటీలో భాగమే కావచ్చు అది. కానీ, ఆ నెగిటివిటీ తనను కొన్ని సందర్భాల్లో బాధకు గురి చేస్తోందన రష్మిక అభిప్రాయపడింది.
ఇలాంటి వాటిని తానెప్పుడూ పట్టించుకోకూడదనే అనుకుంటాననీ, కానీ, రోజు రోజుకీ ఆ పైత్యం తీవ్రంగా మారి దారుణంగా తయారవుతోందనీ చెప్పింది. విమర్శించడం తప్పు కాదు కానీ, ఆ విమర్శ మంచి వుద్దేశ్యం కోసమై వుండాలనీ అంటోంది రష్మిక.
అలాగే, తానేం చేసినా తప్పు పడుతున్నారనీ, ఏమీ అనకుండానే ఏధో అన్నట్లు ప్రచారం చేస్తున్నారంటూ వాపోయింది. అలాగని ప్రతీ ఒక్కరినీ మెప్పించడం తన వల్ల కాదనీ, తనను సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపింది రష్మిక. 
కొత్తగా రష్మిక ఇలా స్పందించడానికి కారణం ఏంటో తెలీదు కానీ, రష్మిక స్పందన వల్ల ఆమెను విమర్శిస్తున్న వాళ్లలో మార్పు వస్తుందా.? అందుకే, ఎవ్వరినీ మార్చడం తన వుద్దేశ్యం కాదనీ, చెప్పాలనిపించింది చెప్పానంతే.. అని రష్మిక క్లారిటీ ఇచ్చేసింది. 
ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప 2’ సినిమాతో పాటూ, హిందీలో మూడు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అలాగే, తమిళంలో ‘వారసుడు’ సినిమా కోసం విజయ్‌తో జోడీ కడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com