టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..
- November 10, 2022
ఆస్ట్రేలియా: టీ20 వరల్డ్ కప్, రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది.
ఈ రోజు మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. మలాన్, మార్క్ వుడ్ స్థానంలో ఫిలిప్ సాల్ట్, జోర్డాన్‌కు చోటు కల్పించింది. ఇండియాకు సంబంధించి అందరూ అనుకున్నట్లుగానే దినేష్ కార్తీక్ బదులు రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. అడిలైడ్‌కు సంబంధించి ఇక్కడ గత 11 మ్యాచుల్లో టాస్ గెలిచిన జట్లు ఓటమి పాలయ్యాయి. రెండు జట్ల వివరాలివి.
ఇండియా: రోహత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మొహ్మద్ షమి.
ఇంగ్లండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్.
తాజా వార్తలు
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్
- ఎయిర్ బస్కి ఏపీ నుంచి ఆహ్వానం...
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!