గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ప్రారంభించిన ఏపీ సిఎం జగన్
- November 11, 2022
అమరావతి: ఏపీ సిఎం జగన్ పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ యూనిట్ ను ఐటీసీ సంస్థ రూ. 200 కోట్లతో నిర్మించింది. 6.2 ఎకరాల స్థలంలో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా ఈ పార్క్ ను అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఈ యూనిట్ ద్వారా 14 వేల మంది రైతులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
రెండో దశ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు కూడా ఐటీసీ ప్రణళికలను సిద్ధం చేస్తోందని సీఎం తెలిపారు. ఈ యూనిట్ ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. మన రైతులను చేయిపట్టి నడిపించే బాధ్యతను ఐటీసీ తీసుకుందని అన్నారు. ఆర్బీకే విధానం ద్వారా రైతుల జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ తొలి స్థానంలో నిలిచిందని వెల్లడించారు.

తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







