‘యశోద’ మూవీ రివ్యూ
- November 11, 2022
నటీనటులు: సమంత రూత్ ప్రభు, దేవ్ మోహన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు.
మ్యూజిక్: మణిశర్మ
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
దర్శకుడు: హరి శంకర్
గ్లామర్ హీరోయిన్‌గా స్టార్‌డమ్ దక్కించుకున్న సమంత ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకెళ్లిపోతోంది. ‘ఓ బేబీ’, ‘యూ టర్న్’ సినిమాలతో ఇప్పటికే సమంత లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ‘యశోద’ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకోబోతోంది. ‘యశోద’ సినిమాకి ప్రమోషన్లు బాగా చేశారు. సినిమా రిలీజ్‌కి కొన్ని రోజుల ముందే, సమంత తన అనారోగ్య సమస్యను బయటపెట్టి అభిమానుల్లో సింపథీని పొందింది. మరి, సమంత స్టామినా, ఆ సింపథీ, ‘యశోద’ విజయంలో ఎంతమేర తోడ్పడ్డాయో తెలియాలంటే ముందుగా ‘యశోద’ కథలోకి వెళ్లాలి.
కథ:
సరోగసీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వేరొకరి బిడ్డని తన కడుపులో మోసేందుకు సిద్ధపడుతుంది యశోద (సమంత). అందుకోసం ఓ సరోగేటెడ్ కంపెనీని అప్రోచ్ అవుతుంది. ఈ కంపెనీ ద్వారా చాలా మంది అమ్మాయిలు సరోగసీ మదర్స్ అవుతుంటారు. అయితే, మొదట్లో అంతా బాగానే వున్నా, ఆ తర్వాత ఆ కంపెనీలో ఏదో అనుమానాస్పదంగా జరుగుతోందని కనిపెట్టిన యశోద దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. తన ప్రయత్నంలో యశోద విజయం సాధించిందా.? అసలు సమంత కనిపెట్టిన ఆ సమ్‌థింగ్ ఫిషీ ఏంటీ.? అనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఆ థ్రిల్ ఫీలవ్వాలంటే ‘యశోద’ సినిమా చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
సమంత ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. సినిమా మొత్తం భారం తానే మోసింది. అది కూడా చాలా అవలీలగా మోసేసింది. స్ర్కీన్‌పై సమంత కనిపించినంత సేపూ మరే నటులు కనిపించరు సరికదా.. చూపు తిప్పుకోనీయలేదు సమంత. గర్భిణిగా తన పాత్రలో చాలా డెప్త్ చూపించింది. అలాగే, యాక్షన్ సీన్స్‌లో సమంత చూపించిన ఎమోషన్, కాన్ఫిడెన్స్ మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్. నో డౌట్.! ‘యశోద’ పాత్రకు నూటికి నూరు మార్కులేసేయొచ్చు సమంతకు. అలాగే మలయాళ నటుడు దేవ్ మోహన్ తన పాత్ర పరిధి మేర బాగానే నటించారు. సమంతకు ధీటుగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్‌లో బాగా మెప్పించింది. రావు రమేష్ తన అనుభవం మేర ఆయన పాత్రలో ఒదిగిపోయారు.
సాంకేతిక వర్గం పని తీరు:
సరోగసీ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయ్. కానీ, ఈ సినిమాకి యాక్షన్ సీక్వెన్సెస్ జోడించడం కొత్తగా అనిపించింది. కాన్సెప్ట్ తెలిసిందే అయినా, కొత్తగా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇలాంటి గ్రిప్పింగ్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. అలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోరే ఈ సినిమాకి మణిశర్మ అందించాడు. మణిశర్మ ఆర్ఆర్‌తో ‘యశోద’ నెక్స్‌ట్ లెవల్‌కి చేరుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఎడిటింగ్‌లో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది. ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్‌లో కాస్త సాగతీత సీన్లు ఇబ్బంది పెడతాయ్. సినిమాటోగ్రాఫీ బాగుంది. ఓవరాల్‌గా ‘యశోద’కు టెక్నికల్ వర్క్ కూడా బాగా సెట్టయ్యిందని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
సమంత పర్ఫామెన్స్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్‌లోని కొన్ని సాగతీత సీన్లు
చివరిగా: సమంత కోసం ‘యశోద’ ఖచ్చితంగా చూడొచ్చు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం