వ్యాపారవేత్త, అతని భార్య హత్య కేసులో కార్మికుడికి మరణశిక్ష ఖరారు
- November 12, 2022
యూఏఈ: 2020లో అరేబియా రాంచెస్‌లో భారతీయ జంటను హత్య చేసిన నిర్మాణ కార్మికుడికి విధించిన మరణశిక్షను దుబాయ్‌లోని అప్పీల్ కోర్టు సమర్థించింది. నిందితుడు అరేబియా రాంచెస్‌లోని మిరాడోర్ జిల్లాలోని ఇంట్లోకి చొరబడి గ్రౌండ్ ఫ్లోర్‌లోని వాలెట్ నుండి Dh1,965 దొంగిలించాడని కోర్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాపారవేత్తను, అతడి భార్యను దారుణంగా హత్య చేశాడు. తిరిగి వెళ్లే సమయంలో తనను చూసిందని 18 ఏళ్ల వ్యాపారవేత్త కూతురి మెడపై కత్తితో దాడి చేయగా.. ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న దర్యాప్తు అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలను సేకరించారు. నిందితుడు ఘటనకు కొన్ని నెలల ముందు వ్యాపారవేత్త విల్లాలో ఉద్యోగం చేసి మానేసిన కార్మికుడిగా నిర్ధారించారు. విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించబడింది. తాజాగా ఆ తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!