దొంగిలించిన కారుతో రైడ్.. Dh508,000 ట్రాఫిక్ జరిమానాలు
- November 12, 2022
యూఏఈ: అబుధాబిలో ఒక యువకుడు తన కారును దొంగిలించాడని, దానితో Dh508,000 విలువైన ఉల్లంఘనలకు పాల్పడ్డాడని.. ఓ మహిళ సదరు యువకుడిపై అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టులో సివిల్ దావా వేసింది. తన పేరుపై నమోదైన ట్రాఫిక్ జరిమానాలను క్లియర్ చేయాలని లేదా నిందితుడి ఖాతాకు బదిలీ చేయాలని తన దావాలో కోరింది. కేసును విచారించిన అబుధాబి క్రిమినల్ కోర్టు చోరీకి పాల్పడినట్లు తేలిన తరువాత యువకుడికి ఏడాది జైలు శిక్ష విధించింది. మహిళ కారును ఉపయోగించి ట్రాఫిక్ ఉల్లంఘనలకు కారణమైనందుకు 500 దిర్హామ్‌లు జరిమానా విధించింది. కానీ, సదరు మహిళ దావాకు సంబంధించి కోర్టు రుసుమును చెల్లించలేదని గుర్తించింది. కోర్టు ఫీజు చెల్లించనందుకు కేసును తిరస్కరించినట్లు కోర్టు తన తీర్పులో పేర్కొంది. అలాగే నిందితుడికి న్యాయపరమైన ఖర్చులు చెల్లించాలని మహిళను ఆదేశించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!







