బహ్రెయిన్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు కీలక వెబ్‌సైట్ల పై హ్యాకర్లు దాడి
- November 12, 2022
బహ్రెయిన్: పార్లమెంటు ఎన్నికలకు కొన్ని గంటల ముందు శనివారం హ్యాకర్లు దేశంలోని వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకున్నారని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొన్ని వెబ్‌సైట్‌ల ద్వారా ఎన్నికలకు ఆటంకం కలిగించాలని హ్యాకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారని, వాటిల్లో ప్రతికూల సందేశాలను ప్రసారం చేస్తారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఇలాంటి చర్యలు పోలింగ్ స్టేషన్‌లకు వెళ్లే పౌరుల నిర్ణయాన్ని ప్రభావితం చేయలేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురైన తర్వాత వచ్చిన మెసేజులను స్క్రీన్‌షాట్ తీసి ఇంటర్నెట్ వినియోగదారులు తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తున్నారని, ఇలాంటివి చేయొద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. బహ్రెయిన్‌లో పార్లమెంటరీ, మునిసిపల్ ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. బహ్రెయిన్ పార్లమెంట్ దిగువ సభ అయిన ప్రతినిధుల మండలిలోని 40 మంది సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటారు. పార్లమెంటు ఎగువ సభ, కన్సల్టేటివ్ కౌన్సిల్, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాచే రాయల్ డిక్రీ ద్వారా నియమించబడింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..