ప్రధాని మోడీ గో బ్యాగ్ అంటూ ఓయూ స్టూడెంట్స్ నిరసన..
- November 12, 2022
హైదరాబాద్: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ ఓయూ స్టూడెంట్స్ నిరసన చేపట్టారు. మోడీ గో బ్యాగ్ అంటూ పెద్ద ఎత్తున నల్ల జెండాలతో ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టొద్దు అంటూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో.. విద్యార్థి సంఘం నాయకులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులను బలవతంగా పోలీసులు వ్యాన్ ఎక్కంచి స్టేషన్‌కు తరలించారు.
అలాగే బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేశారు. నల్ల బెలూన్లు గాల్లోకి ఎగురవేసి యూత్ ఫోర్స్ సభ్యులు నిరసన తెలిపారు. చేనేత మీద ఐదు శాతం జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రామగుండంలోను మోడీకి వ్యతిరేకంగా ప్లెక్సీ లు కట్టారు. తెలంగాణకు మోడీ ఇచ్చి హామీలు ఏమైంది..? ఐటీఐఆర్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని, టెక్స్‌టైల్ పార్కు ఏమైందని, మిషన్ భగీరథకు ఎన్ని నిధులు ఇచ్చారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికిపోయిందని, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్‌ప్లాంట్, మెడికల్ కాలేజీలు ఎన్ని ఇచ్చారని, పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని, ఐఐఎం ఏమైందని ప్రశ్నల రూపంలో నిలదీశారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!