తిరుమల భక్తులకు షాక్..
- November 13, 2022
తిరుమల: తిరుమల వెళ్లే భక్తులకు షాక్ ఇచ్చింది. ఆర్జిత సేవలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. తిరుమలలో ఇవాళ నిర్వహించవలసిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని రద్దు చేసిన టీటీడీ.. వర్షం కారణంగా పార్వేటి మండపం వద్ద నిర్వహించవలసిన కార్యక్రమాన్ని రద్దు చేసింది. దీంతో వైభవోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు.
అలాగే, ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఇది ఇలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 73,323 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,041 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ.3.2 కోట్లుగా నమోదు అయింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్