షార్జా-దుబాయ్ రోడ్డులో హిట్ అండ్ రన్ కేసు.. 48 గంటల్లో డ్రైవర్ అరెస్ట్
- November 13, 2022_1668313152.jpg)
యూఏఈ: షార్జాలో బుధవారం జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఒక ఆసియా ప్రవాసుడు అక్కడికక్కడే మరణించాడని, ఘటనా స్థలం నుంచి పరారైన డ్రైవర్‌ను 48 గంటల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. షార్జా పోలీస్‌లోని ట్రాఫిక్,పెట్రోల్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఒమర్ మొహమ్మద్ బౌ ఘనెం కేసు వివరాలను తెలిపారు. మృతుడు ఆరు లేన్ల మహ్మద్ బిన్ జాయెద్ రోడ్డును దాటడానికి ప్రయత్నిస్తుండగా.. వేగంగా వస్తున్న కారు అతడిని ఢీకొట్టి వెళ్లిపోయిందన్నారు. బుధవారం సాయంత్రం 6.38 గంటలకు ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందిందని చెప్పారు. అలర్టయిన షార్జా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా.. బాధితుడు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఘటనా స్థలం నుంచి పారిపోయిన డ్రైవర్‌ను గుర్తించామని, అతడు 20 ఏళ్ల యువకుడని వివరించారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లో కేసు నమోదైందన్నారు. 140 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లే హైవేలపై అక్రమంగా రోడ్డు దాటవద్దని లెఫ్టినెంట్ కల్నల్ బౌ ఘనెం పాదచారులను హెచ్చరించారు. అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లు వాహనాలను ఆపి సహాయక చర్యలు చేపట్టాలని, అలా కాకుండా ఘటనా స్థలం నుంచి పారిపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!