9 ప్రాథమిక వస్తువుల ధరలను పెంచడానికి రిటైలర్లకు అనుమతి లేదు
- November 14, 2022
యూఏఈ: ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా రిటైలర్లు తొమ్మిది ప్రాథమిక వస్తువుల ధరలను పెంచడానికి అనుమతి లేదు. దీనికి సంబంధించిన ప్రాథమిక వినియోగ వస్తువుల కోసం కొత్త ధరల విధానాన్నియూఏఈ కేబినెట్ తాజాగా ఆమోదించింది. ప్రాథమిక నిత్యావసరాల ధరలను నిర్ణయించడంలో విక్రయ కేంద్రాల నిబద్ధతను మంత్రిత్వ శాఖ నిర్ధారిస్తుంది. వంట నూనెలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు ప్రాథమిక జాబితాలో ఉన్నాయి.వీటి ధరలను మార్చాలంటే రిటైలర్లు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభంలో, ప్రాథమిక ఆహార పదార్థాల ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







