బర్కాలో 369,000 పైగా నిషేధిత కాస్మెటిక్ వస్తువులు స్వాధీనం
- November 14, 2022
మస్కట్: సౌత్ బతినా గవర్నరేట్‌లోని దుకాణాల నుండి నిషేధిత కాస్మెటిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) తెలిపింది. బర్కాలోని కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్, సౌత్ బటినాలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఫార్మాస్యూటికల్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ సహకారంతో అనుమతి లేకుండా అమ్మకానికి ఉన్న 369,213 నిషేధిత కాస్మెటిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీ తెలిపింది. వినియోగదారుల రక్షణ అథారిటీ నిర్ణయం సంఖ్య 845/2022 ప్రకారం.. బ్యూటైల్‌ఫెనైల్ మిథైల్‌ప్రొపియోనల్ (లిలియల్) పదార్థాన్ని కలిగి ఉన్న సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై నిషేధం ఉందన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందకుండా దుకాణాలు ఈ నిషేధ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







