ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ని ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

- November 14, 2022 , by Maagulf
ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ని ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డ మార్కెట్ వద్ద ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. నగరంలో మరిన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. నగరంలో మౌలిక వసతులు కల్పన ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. నగరంలో ముఖ్యమైన రద్దీ ప్రదేశంలో ప్రజలకు అనుగుణంగా మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో స్టేర్ కాస్, లిఫ్ట్ గా, ఎస్కలేటర్, షెల్టర్ వాక్ వేతో పాటు మెరుగైన లైటింగ్, భద్రత సౌకర్యాలతో దీనిని నిర్మించారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు రూ.75.65 కోట్ల అంచనా వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. అందులో ఇప్పటి వరకు 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవాటి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com