యూఏఈలో ఉద్యోగాలు: Dh20,000 వరకు ఆశిస్తున్న ప్రెషర్స్
- November 16, 2022
యూఏఈ: కోవిడ్-19 తర్వాత పునరుద్ధరణ తరువాత యూఏఈలో ఉద్యోగ అవకాశాల పెరిగాయి. దీంతో విద్యార్థుల జీతాల అంచనాలు కూడా పెరిగాయి. ఎంప్లాయర్ బ్రాండింగ్ సంస్థ యూనివర్సమ్ 2022 కోసం చేసిన సర్వే ప్రకారం.. యూఏఈలో ఒక విశ్వవిద్యాలయ విద్యార్థి నెలకు దాదాపు Dh19,726 జీతం ఆశిస్తున్నారు. ఇది గత సంవత్సరంలో దాదాపు Dh18,000 గా ఉన్నది. మేల్ విద్యార్థులు ఈ సంవత్సరం నెలకు Dh18,914 (గత సంవత్సరం Dh17,976)ఆశించగా.. మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థుల నెలవారీ జీతం అంచనాలు Dh20,036(Dh18,537కి)గా ఉన్నాయి. సర్వేలో భాగంగా బిజినెస్/కామర్స్ నుండి 1,686 మంది విద్యార్థులు, ఇంజనీర్/ఐటీ నుండి 3,759 మంది, నేచురల్ సైన్సెస్ నుండి 370 మంది, హుమానిటీస్/కళలు/విద్య/లా నుండి 1,553 మంది, హెల్త్/మెడిసన్ నుండి 1,175 మంది విద్యార్థులతో (మొత్తం 8,543) విద్యార్ధుల అభిప్రాయాలను తెలుసుకుని విశ్లేషించారు. కరోనా తరువాత యూఏఈ ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని, ముఖ్యంగా ట్రావెల్, టూరిజం, రియల్ ఎస్టేట్, హెల్త్‌కేర్, ఇతర కీలక రంగాలు మెరుగైన పనితీరును కనబరచి అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించాయని నివేదిక పేర్కొంది. దీనితోపాటు విద్యార్థుల కోసం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇతర పాశ్చాత్య దేశాలకు వలస వెళ్లడం కంటే దేశంలోనే ఉండి ఉన్నత విద్యను అభ్యసించడానికి యూఏఈ మరింత ఆకర్షణీయంగా మారిందని సర్వే నివేదికలో పేర్కొన్నారు. యూఏఈ యూనివర్సిటీ విద్యార్థులకు 2022లో స్థానిక బ్రాండ్లు అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్స్ ఉన్నాయని యూనివర్సమ్ అధ్యయనం పేర్కొంది. 2022కి వ్యాపార/కామర్స్ విద్యార్థులకు ఎమ్మార్ టాప్ ఎంప్లాయర్ ఎంపికగా ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్, ఆపిల్, గూగుల్, అడ్నాక్ గ్రూప్, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, మైక్రోసాఫ్ట్, ఎతిహాద్ ఎయిర్వేస్, అమెజాన్, అబుధాబి ఇస్లామిక్ బ్యాంక్ ఉన్నాయి. ఇతర ప్రధాన సంస్థలలో మజిద్ అల్ ఫుట్టైమ్ గ్రూప్, ఎటిసలాట్, దుబాయ్ పోలీస్, అల్ ఫుట్టైమ్ గ్రూప్, ఎమిరేట్స్ ఎన్బీడీ, దేవా, ఎనోక్, దుబాయ్ ఇస్లామిక్ బ్యాంక్ ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







