అల్ వుస్తాలో 128 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం

- November 16, 2022 , by Maagulf
అల్ వుస్తాలో 128 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం

మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అల్ వుస్తా గవర్నరేట్‌లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్మగ్లర్ పై దాడులు చేసి వారి నుండి 128 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అల్ వుస్తా గవర్నరేట్ పోలీస్ కమాండ్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ డైరెక్టరేట్ జనరల్ సహకారంతో ఈ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల స్మగ్లర్లు బీచ్‌లో దాచిన 128 కిలోల హషీష్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com