బంగారం పేరిట భారీ మోసం.. ఇద్దరు ఆఫ్రికన్లకు జైలుశిక్ష, జరిమానా

- November 16, 2022 , by Maagulf
బంగారం పేరిట భారీ మోసం.. ఇద్దరు ఆఫ్రికన్లకు జైలుశిక్ష, జరిమానా

దుబాయ్: బంగారం పేరిట మోసం చేసిన కేసులో ఇద్దరు ఆఫ్రికన్లకు దుబాయ్ మిస్డిమీనర్స్, ఉల్లంఘనల కోర్టు మూడు నెలల జైలు శిక్ష, $200,000 (Dh734,620) జరిమానా విధించింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది. అప్పీల్ కోర్టు తీర్పును సమర్థించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. యూఏఈకి చేందిన ఓ పౌరుడిని ఇద్దరు ఆఫ్రికన్లు బంగారం ఉందని సంప్రదించారు. తమ దగ్గర $1,320,000 (Dh4,848,492) విలువైన 33 కిలోల బంగారం ఉందని సదరు వ్యక్తిని నమ్మించారు. గత మేలో జరిగిన ఒప్పందం ప్రకారం.. యూఏఈ పౌరుడి దగ్గర్నుంచి అడ్వాన్సుగా $ 100,000 తీసుకొని బంగారం అప్పగించకుండా తాత్సారం చేశారు. అనంతరం మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీరాలోని ఒక హోటల్‌లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com