రామ్ చరణ్.! ప్యాన్ ఇండియా ఇమేజ్‌ని అలా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడన్న మాట.!
- November 16, 2022
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘#RC15’ సినిమాతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లో ఓ సాంగ్ చిత్రీకరణ కోసం రామ్ చరణ్ సంసిద్ధమవుతున్నాడు.
కాగా, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో రీసెంట్గా ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నాడు. తెలుగు డైరెక్టర్లతోనే కాదు, హిందీ, బెంగాళీ, గుజరాతీ డైరెక్టర్లతో కూడా పని చేయాలని వుందంటూ తన మనసులోని మాటల్ని బయట పెట్టాడు.
అంటే, రామ్ చరణ్ వైవిధ్యమైన కథల్ని కోరుకుంటున్నాడన్న మాట అని ఆయన మాటల ద్వారా అర్ధమవుతోంది. డిఫరెంట్ భాషల నుంచి వచ్చే డైరెక్టర్లు అంటే, డిఫరెంట్ కాన్సెప్టులు వచ్చే అవకాశాలున్నాయని ముందు చూపుతో వ్యవహరించాడన్నమాట చరణ్ అని అభిమానులు భావిస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎలాగూ ప్యాన్ ఇండియా ఇమేజ్ కొట్టేశాడు రామ్ చరణ్. ఏ భాషలోని డైరెక్టర్‌తో పని చేసినా, అది ప్యాన్ ఇండియా రేంజ్లో రిలీజవుతుంది కాబట్టి, రామ్ చరణ్, తనకు వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్‌ని అలా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడేమో.!
తాజా వార్తలు
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!







